Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

పేపర్‌బాయ్‌ని అందుకే తీసుకున్నాడట!

ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ 

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. జయ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వివి వినాయక్, మెహర్ రమేష్, సుకుమార్, ఎన్. శంకర్, దశరథ్ , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ లు ముఖ్య  అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ..ఈ సినిమాకి సంగీతం చేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను. ఈ చిత్రం ద్వారా మీడియా మనిషి అయినా సురేష్ ఉపాధ్యాయ గీత రచయితగా పరిచయమవుతున్నారు. అడగ్గానే ఈ సినిమాలో పాట పాడిన చంద్రబోస్ గారికి ధన్యవాదాలు. దర్శకులు శంకర్ గారు నా సినీ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టించిన గురువుగారు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, డైరెక్టర్ కి , సంపత్ నంది గారికి చాలా కృతజ్ఞతలు..  అన్నారు.

దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నా షార్ట్ ఫిలిం చూసి నాకు ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి గారికి ధన్యవాదాలు. సంపత్ నంది గారి ఏమైంది ఈ వేళ సినిమా చూసినప్పుడు నాలో ఒక డైలాగ్ నాటుకుపోయింది. అలాంటి బ్రిలియంట్ డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. నాకీ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి థాంక్యూ సో మచ్.. ఆయనతో నా ట్రావెల్ వన్ ఇయర్ నేను నా జీవితంలో మర్చిపోలేది... గీతా ఆర్ట్స్ కి పేపర్ బాయ్ టీం అంతా రుణపడి ఉంటుంది. మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు అల్లు అరవింద్ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా చూసిన తర్వాత సంతోష్ శోభన్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. అంత బాగా యాక్ట్ చేసాడు..అన్నారు.

చిత్ర నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా ట్రైలర్ చూసి ట్వీట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి , అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్.. మొన్నటిదాకా ఈ సినిమా చాలా చిన్న సినిమా.. ఎప్పుడైతే గీతా ఆర్ట్స్ ఈ సినిమా టేక్ అప్ చేసిందో అప్పడు జనాలకు ఈ సినిమా మరింత చేరువైంది.. అరవింద్ గారికి ఈ సినిమా చూసి నచ్చిందనగానే ఈ సినిమా హిట్ అని తెలిసిపోయింది.. అసలీ సినిమా ఒకటి ఉందని అల్లు అరవింద్ గారికి తెలియడానికి కారణం మెహర్ రమేష్ గారు.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.. అరవింద్ గారు ఇక్కడికి రావడం మా అదృష్టం.. ఇక్కడికి వచ్చిన మెహర్ గారికి, వినాయక్ గారికి, దశరథ్ గారికి, ఎన్. శంకర్ గారికి , సుకుమార్ గారికి చాలా చాలా థాంక్స్..  ఈ సినిమా కథ చాలా నిజాయితీగా తీసాం.. దర్శకుడు జయశంకర్ ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేసాడు.. సంతోష్ శోభన్ చాలా బాగా యాక్ట్ చేసాడు. దర్శకుడు శోభన్ గారి అబ్బాయి సంతోష్ భవిష్యత్ చాలా బాగా ఉంటుందని ఆశిస్తున్నా.. ఈ సినిమాకి పనిచేసిన అందరు టెక్నిషియన్స్ చాలా బాగా చేశారు.. అందరికి చాలా థాంక్స్..  ప్రొడ్యూసర్స్ వెంకట్, రాములు, నరసింహ గారు ఈ సినిమాతో అందరికి మంచి ప్రోత్సాహాన్నిచ్చారు.. అలాగే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మంచి సంగీతం అందించారు.. లిరిక్ రైటర్స్ చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు..  అన్నారు.. 

హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ..అందరికి చాలా థాంక్స్.. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు.. ముందుగా అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు.. ఈ సినిమా చూసి మా అందర్నీ సపోర్ట్ చేసినందుకు.. గీతా ఆర్ట్స్ పనిచేయాలనే కోరిక ఈ విధంగా తీరింది.. ఇక్కడికి వచ్చిన స్టార్ డైరెక్టర్స్ అందరికి చాలా థాంక్స్..  ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సంపత్ గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా ధరణి పాత్రలో నటించాను.. అది మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.. టీజర్, ట్రైలర్ తర్వాత నాకు మంచి పేరొచ్చింది.. నన్ను ఇంత బాగా చూపించినందుకు సౌందర్ రాజన్ గారికి చాలా థాంక్స్..నాకు సపోర్ట్ చేసిన పేపర్ బాయ్ క్యాస్ట్ అండ్ క్రూ కి చాలా థాంక్స్.. అన్నారు. 

ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. పేపర్ బాయ్ సినిమాలోని కొన్ని సీన్స్ చూసి చాలా ఎక్జయిట్ అయ్యాను. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని టేక్ అప్ చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచేసింది.. సంపత్ నంది మొదటి సినిమా ఏమైంది ఈ వేళ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాను.. ఒక డైరెక్టర్ అయ్యి ఉండి మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.. సంతోష్ మంచి ఎమోషనల్ గా నటించాడు.. చాలా బాగుంది అతని నటన.. స్టోరీ తెలుసు కాబట్టి ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్తున్నాను..  అందరు పెద్ద టెక్నీషియన్స్ పని చేసిన ఈ సినిమా చిన్న సినిమా కాదు పెద్ద సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. అన్నారు. 

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాని చూడాలని నా దగ్గరికి మెహర్ రమేష్ వచ్చారు.. ఆ తర్వాత చూసాక ఈ సినిమా నాకు చాలా నచ్చింది..  అందుకే ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ కి తీసుకున్నాను.. గీత గోవిందం సినిమా హిట్ లో ఉన్న మేము ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుని ఈ సినిమాని టెక్ ఓవర్ చేసాను.. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా జనంలోకి వెళ్లకుండానే కనుమరుగైపోతాయి.. అలా ఇంత మంచి సినిమా అవకూడదని తీసుకోవడం జరిగింది.. సంపత్ నంది ఓ యంగ్ స్టర్ కి అవకాశం ఇచ్చి , తాను ప్రొడ్యూసర్ గా నిర్మించి తీసిన ఇంత గొప్ప సినిమా ని రిలీజ్ చేస్తునందుకు మాకు గర్వకారణం గా వుంది..ఇండస్ట్రీ ని నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే ఎవరికీ సపోర్ట్ ఇవ్వాలి అని ఈ సినిమాని రిలీజ్ చేసాను.. దర్శకుడు జయశంకర్ లో కూడా మంచి టాలెంట్ వుంది.. ఇక సంతోష్ లో కూడా మంచి ప్రతిభ వుంది.. మంచి భవిష్యత్ వుంది.. రియా చాలా అందంగా క్యూట్ గా కనిపించింది సినిమాలో.. పవన్ కళ్యాణ్ పక్కన చేసిన భూమిక గుర్తొచ్చింది ఈ సినిమాలో ఆమెను చూస్తుంటే.. ఈ సినిమాను తప్పకుండా అందరు సపోర్ట్ చేయండి.. అన్నారు.. 

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. సంపత్ నంది సిన్సియర్ గా తీసిన సినిమా ఇది.. మా అందరికి ఎంతో ఇష్టమైన డైరెక్టర్ శోభన్ గారి కొడుకు సంతోష్ హీరోగా వస్తున్న సినిమా, ఎలా నటించాడు అని చూద్దామని వెళ్లి అల్లు అరవింద్ గారితో ఈ సినిమా చూసాం.. ఆయనకు నచ్చడం మా అదృష్టం.. శోభన్ గారి ఆశీస్సులు సంతోష్ గారికి ఎల్లప్పుడూ ఉంటాయి. గీతా గోవిందం తర్వాత గీత ఆర్ట్స్ లో పేపర్ బాయ్ మరో హిట్ కొట్టబోతుంది.. అన్నారు.. 

సినిమా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన అతిధులకు, ప్రేక్షకులకు చాలా థాంక్స్.. అల్లు అరవింద్ గారితో పనిచేయడం నా కల నెరవేరిందని చెప్పాలి.. మా సినిమాని సపోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి చాలా థాంక్స్.. మమ్మల్ని నమ్మి , నాతో సినిమా చేసిన సంపత్ నంది గారికి చాలా థాంక్స్ ప్రొడ్యూసర్స్ గారికి నా కృతజ్ఞతలు.. డైరెక్టర్ జయశంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నాకేమాత్రం పేరొచ్చినా దానికి జయశంకర్ గారే కారణం.. అన్నారు.



from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2NpylWK

Yorum Gönder

0 Yorumlar